»Balakrishna Protest By Whistling In Ap Assembly Meeting 2023 Second Day
AP assembly session 2023:లో విజిల్ వేస్తు బాలకృష్ణ నిరసన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP assembly session 2023) రెండో రోజు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలు కాగానే టీడీపీ సభ్యులు(tdp members) స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్ వేస్తు నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
Balakrishna protest by whistling in AP assembly meeting 2023
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP assembly session 2023) శుక్రవారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు మొదలు కాగానే నిన్నటిమాదిరిగా రావడం రావడమే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానం కోరారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి బాబు అరెస్టుపై చర్చ చేపట్టాలని ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు. దీంతో ఏపీ అసెంబ్లీలో గందరగోళం గోళం ఏర్పడగా సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు(tdp members) ఆందోళనను విరమించకుండా కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఎలా అంటే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
మరోవైపు తాము చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపినా కూడా టీడీపీ సభ్యులు వినడం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వారికి ఏం కావాలో చెప్పాలని కోరినా కూడా వినకుండా ఆందోళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదేదో తెలుగుదేశం ఆఫీసు మాదిరిగా ప్రవర్తిస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులు ఏదో గందరగోళం చేసి సభ నుంచి వెళ్లి పోవాలని చూస్తున్నారు కానీ..సమస్యలపై చర్చకు రావడంలేదన్నారు. తెలుగుదేశం ఆఫీసులో గొడవ గురించి చర్చించుకుంటున్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ క్రమంలోనే సభలో నందమూరి బాలకృష్ణ(Balakrishna)విజిల్ ఊదుతూ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేసిన అచ్చెన్నాయుడు, బీ అశోక్ ను ఈ సమావేశాలు ముగిసే వరకు మొత్తం సభ నుంచి సస్పండ్ చేశారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఈ క్రమంలో సభను మరోసారి వాయిదా వేశారు.