ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఇప్పటికే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయడు అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును సీబీఐకి అప్పుగించాలని మాజీ ఎంపీ, రాజకీయ వ్యూహకర్త ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
Undavalli Arun Kumar PIL to skill development scam to CBI pil on ap high court
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంను ఏపీ సీఐడీ కాకుండా సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ, రాజకీయ వ్యూహకర్త ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar) ఏపీ హైకోర్టు(ap high court)లో గురువారం పిల్ దాఖలు చేశారు. ఈ స్కాం మూడు రాష్ట్రాలకు విస్తరించిందని దీంతోపాటు ఇందులో ఆర్థిక నేరాలు, జీఎస్టీ ఎగవేత వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు. అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించడం సముచితమని ఆయన పిటిషన్లో స్పష్టం చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు అంగీకరించిందని వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే టీడీపీ అధినేతకు మేలు జరగడంతోపాటు చెడు కూడా జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు(chandrababu naidu) ఏపీ CID అధికారుల వేధింపుల నుంచి విముక్తి పొందుతాడు. అంతేకాదు ఒకవేళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెబితే వారు కూడా సాయం చేసే అవకాశం ఉంటుంది. కానీ చెడు ఎంటంటే నాయుడు మొదటిసారిగా సీబీఐ(CBI) విచారణను ఎదుర్కొంటారు. ఆ క్రమంలో చంద్రబాబు సీబీఐ విచారణ ఎదుర్కొన్నారని దేశవ్యాప్తంగా తెలియనుంది. అంతేకాదు ఈ కేసులో ఏదైనా బలమైన సాక్ష్యం దొరికితే చంద్రబాబు నాయుడు ఎక్కువ కాలం జైల్లోనే గడపాల్సి ఉంటుంది.