ఆయన నాకు ఎక్కువ కాదు.. నాగబాబుపై వర్మ ..! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ… సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతూ ఉంటారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా వాటి గురించి కూడా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. కాపులను.. కమ్మవారికి అమ్మేశారంటూ కులం పేరు తెచ్చి ఆయన [&he...
తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన తాజాగా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో చదరి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు అని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ భిక్షత...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. పవన్ కి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక.. చంద్రబాబుతో, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎంను చేస్తాయన్నారు. జగన్‌ను మూడు ముక్కల సీఎం అనడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్ర...
పారిశుద్ద్య కార్మికులు అంటే చిన్నచూపు.. వారు చేసే పని, లేదంటే జీతం తక్కువని కావొచ్చు అందరూ లైట్ తీసుకుంటారు. ఆ కార్మికులు చేసే పని మాత్రం చాలా ఉన్నతమైంది. వారే లేకుంటే.. ఆ మాటే ఊహించుకోలేం. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాల కృష్ణ శానిటేషన్ వర్కర్ల పట్ల తన ఉదారతను, గౌరవాన్ని చాటారు. భోగి పండగ సందర్భంగా కొందరిని ఎంపిక చేసి.. వారికి పాద పూజ చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాకినాడ జిల్లా రామచంద్రాపు...
ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత రెండేళ్ల నుంచి ఏం చేశారని అడిగారు. కాలయాపనకు కారణాలెంటో వివరించాలని డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన మీడియాకు చూపించారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరానికి రివర్స్ గేర్ పడిందని విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఇతర అంశం ముడిపడి ఉందని సంచలన వ్యాఖ్...
బీజేపీలోకి వెళ్లే నాయకులు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోను తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి సాధించిందన్నారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు. ఉమ్మ...
ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో తన స్టెప్పులతో అదరగొట్టారు. సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన గిరిజన మహిళలతో కలిసి పాదం కలిపారు. మంచి ఊపుతో డ్యాన్స్ చేశారు. మార్నింగ్ వాక్ కి వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో అంబటి పాల్గొన్నారు. పండుగ సంబరాల్లో సంప్రదాయ నృత్యాలు చేస్తున్న గిరిజన మహిళలతో కలిసి అంబటి స్టెప్పేశారు. అంబటి డ్యాన్స్ కి అక...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 50 సీట్లు కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 2019 తరహా మ్యాజిక్ పని చేయదన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివెల్‌కు హాజరైన ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో కమలం పార్టీ చాలా ఎంపీ సీట్లను కోల్పోతుందని, అలాగే కేంద్రంలోను అధికారం కోల్పోయే అవకాశాలు లేకపోలేదని, అందుక...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్ ఫిలోర్ వద్ద యాత్ర చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో వెంటనే నేతలు, కార్యకర్తలు ఆయనను హాస్పటల్ కు తరలించగా మార్గ మధ్యలోనే కన్నుమూశారు. ఈ ఉదయం రాహుల్ పాదయాత్ర ప్రారంభించగా.. జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ పా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రుల కౌంటర్ అటాక్ కొనసాగుతూనే ఉంది. రణస్థలం సభలో పవన్ కల్యాణ్.. సీఎం జగన్, మంత్రి రోజా లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత మంత్రులు ఒక్కొక్కరు పవన్‌పై ఫైర్ అవుతున్నారు. మంత్రి రోజా మరోసారి పవన్ కల్యాణ్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు మంచి కలెక్...
ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అంటూ, అమరావతి రాజధానిగా మాత్రమే నిధులు కేటాయిస్తామని చెబితే తాము ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమిస్తామని మంత్రి ధర్మాన ప్రసాద రావు పునరుద్ఘాటించారు. అరున్నర దశాబ్దాల పాటు ఓ ప్రాంత ప్రజల నోరు నొక్కి ప్రభుత్వ ధనాన్ని ఓ ప్రాంతానికి కేటాయించి, అభివృద్ధి చేయడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని విమర్శించారు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం న...
జగన్‌ను మీరు విమర్శించలేదా: సొంత పార్టీ నేతలపై రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలయికను వైసీపీ నేతలు తప్పుపట్టడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన పార్టీ నుండి గెలిచినప్పటికీ మొదటి నుండి నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు-పవన్ పరస్పరం తిట్టుకున్నారని, అలాంటప్పుడు వారు ఎలా కలుస్తారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నార...
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించాక 18వ తేదీన తొలిసారి ఈ సభను నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం, పలు పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారని తెలుస్తోంది. ఈ సభపై రేణుకా చౌదరి మాట్లాడుతూ… తెలంగాణలో ఈశాన్య దిక్కు స్థానికులకే కలిసి వస...
జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శల వర్షం కురిపించారు. పవన్ ఓ సీజనల్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు వేశారు. పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండరంటూ విమర్శలు చేశారు. ఆవేశపూరిత స్పీచ్ లతో పవన్ కల్యాణ్ యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. నాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. పుస్తకాలు చదవడం కాదు.. ఆ గొప్ప భావజా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే వారికి అంత భయం, పిరికితనం ఎందుకు అని ప్రశ్నించారు. అధికారం ఉందనే అహంకారం కనిపిస్తోందని, కానీ అది ఏమాత్రం మంచిది కాదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. నిన్న రణస్థలంలో పవన్ సభ ద్వారా తాను ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారని వ్య...