ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో తన స్టెప్పులతో అదరగొట్టారు. సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన గిరిజన మహిళలతో కలిసి పాదం కలిపారు. మంచి ఊపుతో డ్యాన్స్ చేశారు. మార్నింగ్ వాక్ కి వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో అంబటి పాల్గొన్నారు. పండుగ సంబరాల్లో సంప్రదాయ నృత్యాలు చేస్తున్న గిరిజన మహిళలతో కలిసి అంబటి స్టెప్పేశారు.
అంబటి డ్యాన్స్ కి అక్కడున్న వారు ఈలలు వేయగా.. రెచ్చిపోయిన అంబటి మరింత జోష్ గా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. రాంబాబు కూడా దానికి గట్టిగానే కౌంటర్ వేశాడు. ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ చేసి నిజంగానే సంబరాల రాంబాబు అనిపించుకున్నాడు అంటున్నారు పలువురు రాజకీయ నాయకులు.