VSP: విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో ‘బిగో’ అనే ఆసియాటిక్ ఆడ సింహం మృతి చెందింది. అనిమల్ రెస్క్యూ సెంటర్లో సంరక్షణలో ఉన్న ఈ సింహం సుమారు 24 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య కారణాలతో తుదిశ్వాస విడిచినట్లు జూ క్యూరేటర్ జి. మంగమ్మ తెలిపారు. సాధారణంగా అడవుల్లో ఆసియాటిక్ సింహాల ఆయుష్షు 15 ఏళ్లు మాత్రమేనన్నారు.