సత్యసాయి: పరిగి మండల సంగమేశ్వరపల్లిలో గురువారం నూతన పాసు పుస్తకాలు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి, తహసీల్దార్ హసీనా సుల్తానా పాల్గొన్నారు. గోవింద రెడ్డి మాట్లాడుతూ.. భూములు ఉన్న ప్రతి ఒక్కరూ పాసుపుస్తకాలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిగి పంచాయతీ కన్వీనర్ తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.