TG: వీబీజీ రామ్‌జీ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. సంక్రాంతి పండగ తర్వాత ఈనెల 20 నుంచి 30 వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ గొప్పతనం వివరిస్తూ కరపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు ఉంటాయని పేర్కొన్నారు.