AP: చిత్తూరులో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. స్థానిక కోర్టు కాంప్లెక్స్‌లో బాంబు పెట్టామని ఆగంతకులు నుంచి ఈ-మెయిల్ వచ్చింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు.. కోర్టు సిబ్బందిని బయటకు పంపించేశారు. అటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టు ఆవరణలో తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.