చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలు కవిత మృతదేహం జీడీ నెల్లూరులో లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె అదృశ్యంపై జనవరి 2న పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహించారని న్యాయవాది అర్షద్ అయూబ్ ఖాన్ గురువారం ఆరోపించారు. దీంతో ఆమె మృతదేహంగా గుర్తించబడిందని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని NHRCకి ఫిర్యాదు చేశామన్నారు.