ADB: నేరడిగొండ మండలంలోని సవర్గామా గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ ఇవాళ పర్యటించారు. గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో కిచన్ షెడ్డు నిర్మాణ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. సమావేశంలో అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ కలిసికట్టుగా పనిచేసే అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో మండల BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.