అందరి అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టో (Manifesto) రూపొందిస్తాం. దీని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దాం’ అని కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడారు.
ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైన తెలుగు దేశం పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవి కుమార్ ఫిర్యాదు చేశారు.
Kushboo : రాహుల్ గాంధీ పై వేటు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘మోడీలు అందరూ దొంగలేనా?’’ అన్నందుకు రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. ఓ వర్గాన్ని అవమానించారంటూ రాహుల్‌పై బీజేపీ నేత దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించడంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వచ్చింది.
Bansuri Swaraj : బీజేపీ సీనియర్ నేత, దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె .. బన్సూరీ స్వరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో- కన్వీనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోన్న బాన్సురీకి రాజకీయాల్లో ఇది తొలి అడుగుగా విశ్లేషకులు పేర్కొన్నారు.
సస్పెండ్ తో జనగామతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. కాగా పార్టీ నిర్ణయంతో రాఘవరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తున్నది.
నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విస్మరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోరటలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఆదివారం వ్యాఖ్యానించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత రిట్ పిటిషన్ పైన ఈ రోజు (సోమవారం, 27) న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.
కవిత ఈ రోజు వరుసగా చేసిన పలు ట్వీట్లు (Kavitha Twitter) నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓ చిన్నారి వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యూష్ గార్నెపూడి అనే నెటిజన్ తమ కూతురు వీడియోను పోస్ట్ చేయగా.. దీనిని రీట్వీట్ చేశారు కవిత.
ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) పైన అనర్హత వేటు పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఓ కేసులో జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన లక్ష్వద్వీప్ మాజీ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించాడు.
Supreme Court:మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహాం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో (status report) ఎలాంటి పురోగతి లేదని అభిప్రాయపడింది. ఎంక్వైరీ (enquiry) మరింత వేగవంతం చేయాలని స్పష్టంచేసింది.
రాహుల్ పై అనర్హత వేటు (Disqualification)పై సోమవారం కాంగ్రెస్ పార్టీ సభ్యులు నలుపు దుస్తులు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. రాహుల్ సభ్యత్వ రద్దుపై నిరసన వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు (Police) తనను చంపేస్తారేమోనని మాఫియా డాన్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (gangster-turned-politician Atiq Ahmed) భయపడుతున్నాడు.
Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ (paper leak) కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకుడిగా పనిచేసే తిరుపతయ్యను (tirupataiah) పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరొ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (Tadikonda legislator Dr Vundavalli Sridevi)కి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదంటే అది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి మాత్రమేనని వైసీపీ లోకసభ సభ్యులు (YCP MP) నందిగం సురేష్ (Nandigam Suresh) సంచలన వ్యాఖ్యలు చేసారు.