»Supreme Court To Hear Tomorrow Lakshadweep Mps Plea Against Lok Sabha Not Revoking Disqualification Https Www Livelaw In Top Stories Supreme Court Lakshadweep Mp Mohammed Faizal Lok Sabha Disqual
Supreme Court: రాహుల్ ఇష్యూ.. సుప్రీం కోర్టుకు లక్షద్వీప్ మాజీ ఎంపీ
ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) పైన అనర్హత వేటు పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఓ కేసులో జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన లక్ష్వద్వీప్ మాజీ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించాడు.
ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) పైన అనర్హత వేటు పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఓ కేసులో జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన లక్ష్వద్వీప్ మాజీ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించాడు. తన పిటిషన్ పైన ముందస్తు విచారణ చేపట్టాలని కోరగా, అంగీకరించింది. ఫైజల్ పిటిషన్ పైన మంగళవారం విచారణ చేపట్టనుంది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (Chief Justice of India-CJI DY Chandrachud), న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది.
మహమ్మద్ ఫైజల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకుడు. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లక్ష్వద్వీప్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందాడు. 2009 లోకసభ ఎన్నికల సమయంలో మహమ్మద్ సలీహ్ అనే కాంగ్రెస్ నాయకుడి పైన దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇతని పైన హత్యాయత్నం కేసు నమోదయింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ ఏడాది జనవరి 11న కవరత్తి సెషన్స్ కోర్టు.. ఫైజల్ ను దోషిగా తేలుస్తూ, పదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో జనవరి 13న అతనిపై లోకసభ సచివాలయం అనర్హత వేటు వేసింది. ఫైజల్ పైన వేటు కారణంగా ఖాళీ అయిన లక్షద్వీప్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనిని ఫైజల్ కేరళ హైకోర్టులో సవాల్ చేశాడు. అక్కడ ఆయనకు ఉపశమనం లభించింది.
స్టే కారణంగా అనర్హత వర్తించదని కూడా చెప్పింది. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను వాయిదా వేసింది. అయితే లోకసభ సచివాలయం మాత్రం అతని పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. దీంతో అతను సుప్రీం గడప తొక్కాడు. తనకు విధించిన శిక్ష పైన కేరళ హైకోర్టు స్టే విధించిందని, అయినప్పటికీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదని పేర్కొన్నాడు. పార్లమెంటుకు వెళ్లినా తనను భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. తనపై లోకసభ సచివాలయం విధించిన అనర్హత వేటును తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. దీనిని మంగళవారం విచారించనున్నారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఫైజల్ కేసు వైపు మరలింది. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.