కవిత ఈ రోజు వరుసగా చేసిన పలు ట్వీట్లు (Kavitha Twitter) నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓ చిన్నారి వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యూష్ గార్నెపూడి అనే నెటిజన్ తమ కూతురు వీడియోను పోస్ట్ చేయగా.. దీనిని రీట్వీట్ చేశారు కవిత.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy scam) బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పిటిషన్ పైన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ రోజు (సోమవారం, 27) విచారించనుంది. ఇదే సమయంలో కవిత ఈ రోజు వరుసగా చేసిన పలు ట్వీట్లు (Kavitha Twitter) నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓ చిన్నారి వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యూష్ గార్నెపూడి అనే నెటిజన్ తమ కూతురు వీడియోను పోస్ట్ చేయగా.. దీనిని రీట్వీట్ చేశారు కవిత. అందులో ఓ చిన్నారు.. కేసీఆర్ తాత.. తగ్గేదేలే.. అంటోంది. ‘నా కూతురు మేధ కేసీఆర్ గారి పని తీరు నచ్చి మద్దతిస్తోందని, జై తెలంగాణ.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని ట్వీట్ చేశాడు. దీనిని కవిత లవ్ సింబల్ తో రీట్వీట్ చేశారు.
నెటిజన్లు కూడా ఈ వీడియో పైన భిన్నంగా స్పందిస్తున్నారు. గుడ్ చిట్టితల్లి అంటు పలువుర నెటిజన్లు మెచ్చుకున్నారు. కవిత ఇలాంటి వాటిని బాగానే లైక్ చేస్తారని, కానీ ప్రజా సమస్యలను కూడా కింద ప్రస్తావిస్తుంటే వాటిని పట్టించుకోరా అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. పిల్లలకు కూడా స్వార్థ రాజకీయాలను బోధిస్తున్నారంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే ఆ పాప వయస్సు కనీసం మూడు నాలుగేళ్లు ఉంటుందేమో.. కేసీఆర్ గారి పని తీరుకు మా పాప మద్దతిస్తోందంటూ ట్వీట్ చేయడం ఆశ్చర్యకరంగా కనిపించిందని అభిప్రాయపడుతున్నారు. ఆ పాప చాలా చిన్న పిల్ల.. బీఆర్ఎస్ తెలంగాణను ఎలా ముంచిందో ఆ చిన్నారికి తెలియదు.. మనం 2050 నుండి 2060 వరకు తలసరి రూ.5 లక్షల అప్పుతో ఉన్నాం… కచ్చితంగా ఈ ట్వీట్ చేసిన వారి కూతురు చెల్లించాల్సి ఉంటుంది.. అని మరో నెటిజన్ పేర్కొన్నారు.
కవిత ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. బిల్కిస్ బానో రేపిస్ట్ తాజాగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వేదిక పంచుకున్నారంటూ ఎన్డీటీవీ న్యూస్ ఫీడ్ ను షేర్ చేశారు.
మరో ట్వీట్ లో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కు కూతురు పుట్టిన విషయం తెలిసి కంగ్రాట్స్ తెలిపారు.