ఎస్‌ఎస్‌సీ పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పోయిందని.. వెతికి పెట్టాలని ఆన్ లైన్‌లో కంప్లైంట్ చేశారు.
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన నిరసన దీక్ష చేపడుతానని ప్రకటించారు. వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
ప్రధాని మోడీ కామెంట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అభివృద్ది పనుల సాకు చూపి.. రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్ వచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మాస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ పేరులో గల ‘w’ అక్షరం తొలగించారు.
Uttam Kumar Reddy : ప్రధాని నరేంద్రమోడీ శనివారం తెలంగాణలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభించిన చాలా ప్రాజెక్టులు సంవత్సరాల క్రితమే ప్రకటించబడ్డాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ఇంత ఆలస్యంగా ప్రారంభించి.. మోడీ వాటిని కొత్త కార్యక్రమాలుగా ...
Karnataka: కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఓట్లు రాబట్టుకునేందుకు సాధ్యం కాని హామీలను ప్రజలపై గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ రాజకీయాలన్నీ ఇప్పుడు ఆటోవాలాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల ఓట్ల కోసం అధికార బీజేపీ మొదలు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 7.7 ల...
విద్యుత్ మీటర్ల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం(tdp leader Pattabhi Ram) ఆరోపించారు. ఆ క్రమంలో మీటర్ల కాంట్రాక్టులు మొత్తం బినామీలకే ఇచ్చుకున్నట్లు గుర్తు చేశారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్, సిసిసి కార్నర్ వద్ద శనివారం మహా ధర్నా పెద్ద ఎత్తున జరిగింది. సింగరేణి ప్రాంతంలో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రె...
అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభానికి ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీ బేంగపేట విమానాశ్రయంలో దిగారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వైష్ణవ్ తదితరులు స్వాగతం పలికారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా నిధులు ప్రకటించాలని కోరుతున్నాం. మీ రాజకీయ స్వార్థం కోసం ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం.