కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలపై కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోరా? అని ప్రశ్నించారు.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలపై కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ విధానాల వల్ల నేతన్నలు జీవితాలు ఇబ్బందుల్లో పడేలా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు నిలిపివేసిందని ఆయన అన్నారు. గతంలో వాళ్లకి చేతినిండా పని ఉండేలా ఆర్డర్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొట్టడం సరికాదన్నారు. చేనేతమిత్ర వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్లని పట్టించుకోరా? అని కేటీఆర్ అన్నారు. వస్త్ర పరిశ్ర్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ అన్నారు.