ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షడు కేఏ పాల్ తెలిపారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ గద్దర్ కు రూ.150 కోట్లిచ్చి మునోగోడు ఉప ఎన్నికలో పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. పాలనాపరంగా కేంద్రంలోప్రదాని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్న మోడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ అవసరమా అని పాల్ ప్రశ్నించారు.
అభివృద్ధి జరగాలంటే కేఏ పాల్ అధికారంలోకి రావాలని, ప్రజాశాంతి పార్టీలో చేరుతామని లక్షల మంది వాట్సప్ మెసేజ్లు చేస్తున్నారని పాల్ చెప్పారు. 70 శాతం తెలంగాణ ప్రజలు కేఏ పాల్ పాలన కోరుకుంటున్నారన్నారు. బంగారు తెలంగాణ కావాలనుకునేవారు ప్రజా శాంతి పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.