AP: మాజీ CM జగన్ YCPఅనుబంధ విభాగాలపై సమావేశం ఏర్పాటు చేశారు. నాలుగు నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడంలేదని, విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం అన్నారు. సమస్యలను డైవర్ట్ చేయడానికే తెరపైకి కొత్త అంశాలు తెస్తున్నారన్నారు. పార్టీలో కష్టపడ్డవారికి ప్రధాన్యత ఉంటుందని, కార్యకర్తలకు అండగా ఉంటానని జగన్ వెల్లడించారు.