AP: తిరుమలలో ప్రస్తుతం స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. నందిని, ఆల్ఫా సంస్థల నుంచి రూ.475లకు నెయ్యిని కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే శాంపిల్స్ టెస్ట్ చేశామని.. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా ఉంటుందో రిపోర్ట్ ఇస్తామని ఈవో వెళ్లడించారు. అంతేకాకుండా 18 మందితో సెన్సరీ ప్యానల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.