లెబనాన్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత పౌరులకు బీరుట్‌లోని రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. లెబనాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని తెలిపింది. ఒక వేళ అక్కడే ఉండాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలని, రాయబార కార్యాలయం సూచించిన ఈ మెయిల్, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లో సంప్రదించాలని పేర్కొంది. ఆరు రోజులుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఈ ఘటనలో 580 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.