TG: ప్రజల బాగోగులను పట్టించుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కష్టాలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.