భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ నవ వధువుపై ఏడెనిమిది మంది అత్యాచారానికి ఒడిగట్టారు. భర్తను చెట్టుకు కట్టేసి.. మద్యం మత్తులో అతని కళ్లెదుటే ఆమెపై అత్యాచారం చేశారు. ఈ అమానుష ఘటన అక్టోబర్ 21న మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. అక్టోబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ కేసులో ఇప్పటికే అధికారులు 100 మందికి పైగా అనుమానితులను విచారించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.