NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటర్ కాలేజ్లో ఎంపికైన క్రీడాకారులకు కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా.జి.బాల కిషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బీ.ఆర్ నేత ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉ.10:30గం.లకు క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలన్నారు.