VSP: పాడేరు ఐటీడీఏ పరిధిలోని గురుకుల, ఏకలవ్య పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులను తిరిగి రెన్యూవల్ చేయాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం సెక్యూరిటీ గార్డులతో కలిసి ఐటీడీఏ పీవో వీ.అభిషేక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సెక్యూరిటీ గార్డులకు మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు.