TG: ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. 317 జీవో, డీఏ, ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీల రిపోర్టులు.. ముఖ్యంగా ధరణి కమిటీ రిపోర్టుపై మంత్రులు చర్చలు జరపనున్నారు. ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు సముఖతపై నిర్ణయం తీసుకోనున్నారు. మూసీ బాధితులకు పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.