లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులో ముగ్గురు జర్నలిస్టులు చనిపోయారు. వీరిని బీరుట్ కేంద్రంగా పని చేసే అరబ్ టీవీ ఛానెల్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు గాజాలోని ఖాన్‌యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 38 మంది చనిపోయారు.