NLR: కలుషిత నీటి సరఫరాతో అల్లూరు కోనేరులోని చేపలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ చెరువుకు పైడేరు ఎస్కేప్-2 ఛానల్ నుంచి ఏటీఎస్ ఛానల్ ద్వారా నీరు సరఫరా అవుతోంది. కొడవలూరు మండలం జాతీయ రహదారి సమీపంలోని కొన్ని ఫ్యాక్టరీల ద్వారా వెలువడే విషపు నీటిని సమీపంలోని పైడేరు ఛానల్లోకి వదులుతుండటం వల్ల ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు చర్చించుకుంటున్నారు.