AP: వాతావరణంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రజా రవాణా వ్యవస్థలోకి విద్యుత్తు బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్నాయి. ‘పీఎం ఈ-బస్ సేవ’ పథకం కింద గుంటూరు జిల్లాకు వంద బస్సులు కావాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ బస్సుబు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. దీంతో వంద కి.మీ. దూరం ఉండేలా ఆయా మార్గాల్లో పల్లె వెలుగు కింద బస్సులు నడపనున్నారు.