డైరెక్టర్ సతీష్ బాబు స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘జాతర’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రానున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. త్వరలోనే టీజర్, ట్రైలర్ రిలీజ్ కానున్నాయి. ఇక ఈ మూవీలో దీయా రాజ్ కథానాయికగా నటించింది.