బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో CM చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ప్రయత్నిస్తానని నాతో చెప్పారు. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉంటే మీ మధ్య ఈ పొత్తు ఏర్పడేదా? అని బాలయ్య ప్రశ్నించగా.. అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో. నా అరెస్ట్ ఆ నిర్ణయానికి ఊతమైంది. మనం నిమిత్తమాత్రులం. విధి స్పష్టంగా ఉంటుంది’ అని CBN అన్నారు.