ELR: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి శనివారం ఏలూరు జిల్లాకు రానున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనరు మాలతీరాణి ఇంటికి చేరుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.1.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు గోపీనాథపట్నంలోని శ్రీలక్ష్మీనారాయణ ఫౌండేషన్ వద్ద భోజన విరామం తీసుకొని ఆపై ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు అని పేర్కొన్నారు.