ఉచిత ఇసుక పాలసీలో సీనరేజి రుసుం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21న జరిగిన క్యాబినెట్ భేటీలో ఇసుక పాలసీపై తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేలా ఈ జీవో రూపొందించారు. సీనరేజి ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీకి చర్యలు తీసుకున్నారు. ఇకపై సీనరేజి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే నిర్మాణ అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చు.