తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలక దశకు చేరింది. శంషాబాద్-విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ ఖరారైంది. ఇందులో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విశాఖకి 4 గంటల్లోపే చేరుకోవచ్చు.