TG: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పద్మశ్రీ గ్రహీత గుస్సాడి కనకరాజు మృతి చెందారు. గుస్సాడి నృత్యానికి జాతీయ గుర్తింపు తెచ్చారు. కనకరాజును 2021లో పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. గుస్సాడి కనకరాజు మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశవ్యాప్తంగా పరిచయం చేసిన అరుదైన కళాకారుడు కనకరాజు అని కొనియాడారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.