TG: మాజీ మంత్రి కేటీఆర్కు జైలు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ అన్నారు. భయంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల అక్రమాలు బయటకు వస్తాయని వణకు మొదలైందని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన వారు వ్యభిచారులయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మంత్రులను చేసినవారిని ఏమనాలి ప్రశ్నించారు. నాలుగు రోజులు ఆగితే సీఎం రేవంత్ అంటే ఏంటో చేస్తారని తెలిపారు.