జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనడంపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లడాన్ని చూసి పాకిస్తాన్ కడుపు మండుతోందని అన్నారు. కాగా, మొదటిదశ ఎన్నికల్లో 61 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని.. లోక్సభ ఎన్నికలతో(58 శాతం) పోలిస్తే ఇది మూడు శాతం ఎక్కువని అని పేర్కొన్నారు.