AP: పర్యటక రంగాన్ని గత YCP ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి దుర్గేశ్ విమర్శించారు. ఈ రంగానికి రెండేళ్లలో పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ఈనెల 27 ప్రపంచ పర్యటక దినోత్సవం సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో 38 విభాగాల్లో అవార్డులు కూడా ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. పర్యటక రంగం అభివృద్ధికి ప్రణాళికను తయారుచేసినట్లు చెప్పారు.