ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గించేందుకుగాను కీలక చర్యలు తీసుకోవాల్సి ఉందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా నడపడంతోపాటు ఇతర నేరాలకు పాల్పడేవారికి అధిక ప్రీమియం చెల్లించే విధానం తీసుకురావాల్సి ఉందన్నారు. దీనికోసం ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యతో వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని అనుసంధించాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.