AP: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత సైదు గోవర్ధన్‌ను శిక్షించాలని జనసేన నేతలు ర్యాలీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటలక్ష్మిపై అతను అనుచిత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే ఆయనను కఠినంగా శిక్షించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ఎవరి అండ చూసుకొని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.