కోల్కతాలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రామ్ సేవలు త్వరలో కనుమరుగు కానున్నాయి. మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు వారసత్వంగా కొనసాగుతున్న ట్రామ్ సర్వీసు మినహా మిగిలిన సర్వీసులను త్వరలో నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ సర్కారు నిర్ణయించింది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్కతా వీధుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ట్రామ్ ప్రయాణికులు నిశ్చయించుకున్నట్లు సమాచారం.