TG: మంత్రిగా పని చేసిన KTRకి చట్టాలపైన కనీస పరిజ్ఞానం లేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బావమరిదిని కాపాడుకోవడం కోసం కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీల్లో 6.5లీటర్ల కంటే ఎక్కువ మద్యం ఉంటే ఎక్సైజ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేయడానికి ఎలాంటి వారెంట్ అవసరం లేదన్నారు. రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు.