విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బతికి ఉన్న ఎలుక కనిపించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన నార్వే నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకుంది. దీంతో ఫ్లైట్‌లో గందరగోళం ఏర్పడింది. సిబ్బంది వెంటనే విషయాన్ని ఫైలట్‌కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఫైలట్ విమానాన్ని డెన్మార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశాడు.