ప్రతి ఒక్కరి లైఫ్లో టైమ్ టేబుల్ (Time table) ఎంతో అవసరం. దీనివల్ల ప్రణాళికాబద్ధంగా జీవించొచ్చు. కానీ మనలో అధిక శాతం మంది టైమ్ టేబుల్ లేకుండా జీవితాన్ని (Life) సాగించేస్తుంటారు. కానీ సమయం విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ టైమ్ టేబుల్ నిర్వహిస్తుంటారు. ఓ బాలుడు ఆరేళ్లకే చక్కగా టైమ్ టేబుల్ రాసుకుని, చూసే వారు ఔరా అనేలా చేశాడు. ఈ పిల్లడు టైమ్ టేబుల్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. మార్నింగ్ (Morning) 9 గంటలకు నిద్ర లేవాలని రాసుకున్నాడు. తిరిగి నైట్ 9 గంటలకు నిద్రించాలని టైమ్ పెట్టుకున్నాడు. అంటే నిద్రకు 12 గంటలు కేటాయించినట్టు.
ఆ వయసు వారు సహజంగానే 10 గంటల వరకు నిద్రపోవచ్చు. ఉదయం 9 గంటలకు నిద్ర లేచింది మొదలు ప్రతి పనికీ సమయం కేటాయిస్తూ వెళ్లిన బాలుడు.. చదువు(Study)కి మాత్రం చాలా తక్కువ సమయమే ఇవ్వడం చూసే వారికి నవ్వు తెప్పిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ (Breakfast)కు అరగంట కేటాయించుకోగా, ఫైటింగ్ టైమ్ అంటూ ఓ గంట కేటాయించేశాడు. మరి ఎవరితో ఫైట్ చేస్తాడో తెలియదు. స్నానానికి అరగంట కేటాయించాడు. అది కూడా మధ్యాహ్నం(afternoon) 2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు. చదువుకు మాత్రం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 2.45 గంటల వరకు అని రాసుకున్నాడు. చదువుకు పెద్ద సమయం అవసరం లేదనుకుంటున్నట్టుంది.