HABITS TO CHANGE YOUR LIFE : మనం ఎవరైనా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటాం. అయితే అలా బ్రతకడానికి ఏం చేయాలనేదానిపైనా దృష్టి పెట్టాల్సిందే. రోజువారీ పనుల్లో భాగంగా కొన్ని మంచి అలవాట్లను(HABITS) ఇముడ్చుకోవాల్సిందే. అప్పుడే మనం హ్యాపీ లైఫ్‌ని(HAPPY LIFE) లీడ్ చేయగలుగుతాం. ఆ అలవాట్లు ఏంటంటే..?
ఆఫీసుల్లో, వ్యాపారాల్లో ఎంత సమయం బిజీగా గడిపినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత వాటి నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అవ్వాలి. వ్యక్తిగతంగా మీ కోసం, మీ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆనందంగా ఉండేందుకు సహకరిస్తుంది. ప్రశాంతంగా ఉండేందుకు యోగా, ధ్యానం లాంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇవి మీ లైఫ్‌ని మరింత ఎఫెక్టివ్‌గా లీడ్ చేయడానికి ఎంతగానో పనికి వస్తాయి. ఇంట్లో ఫోన్లు, ల్యాప్టాప్ల్లాంటి వాటితో వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి కాలం గడిపేందుకు చూసుకోవాలి.
మెదడుకు మెడిటేషన్ ఎంత అవసరమో శరీరానికి వ్యాయామమూ అంతే అవసరం. అందుకనే కనీసం అరగంట నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన మంచి ఆహారం తినేందుకు ప్రయత్నించారు. అలాగే మీకు ప్రియమైన వారితో కలిసి కాస్త సమయాన్ని ఏకాంతంగా గడపాలి. అందువల్ల మీ శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి. అవి మిమ్మల్ని ఆనందంగా ఉంచేందుకు సహకరిస్తాయి. అందువల్ల మీ రిలేషన్స్ కూడా బలపడతాయి. అలాగే మీ హాబీలకు కూడా కాస్త సమయం కేటాయించాలి. అవి చేస్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి వాటినీ మీ రోజు వారీ పనుల్లో భాగంగా చేసుకోవాలి.