polls : రెండో విడత అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థి ఎవరంటే..?
శుక్రవారం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ అభ్యర్థి నిలిచారు. ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Richest Candidate:శుక్రవారం దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు వెంకట రమణ గౌడ (Venkata ramane Gowda) నిలిచారు. ఆయన కర్ణాటకలో సీఎం హెచ్డీ కుమారస్వామిపై పోటీ చేస్తున్నారు. నామినేషన్ల సమయంలో ఆయన తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మొత్తం ఆయనకున్న ఆస్తుల వివరాలను రూ.622 కోట్లుగా ప్రకటించారు.
నామినేషన్ల సమయంలో ఇచ్చిన ఆస్తుల వివరాల్ని బట్టి చూసుకుంటే వెంకట రమణ గౌడ్ అత్యంత సంపన్న అభ్యర్థిగా(Richest Candidate) నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు సురేష్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.593 కోట్లుగా వెల్లడించారు. సురేష్ బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
వెంకట రమణ గౌడ్, సురేష్‌ల తర్వాత మూడో స్థానంలో సినీ నటి హేమ మాలిని ఉన్నారు. ఆమె మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె ఆస్తులు 278 కోట్లుగా వెల్లడించారు. ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.232 కోట్లుగా తెలిపారు. ఐదో స్థానంలో కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ఉన్నారు. తనకు రూ.217 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆయన తెలిపారు.