హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్‌లోని జీ స్కూల్ యాజమాన్యం ఓ ముస్లిం విద్యార్థినిని క్లాస్ రూములో స్కార్ఫ్ ధరించవద్దని కోరడంతో ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను తరగతి గదిలో హిజాబ్ ధరించవద్దని(Hijab issue) ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కోరడంతో హయత్‌నగర్‌లోని ప్రైవేట్ స్కూల్ జీ యాజమాన్యంపై కేసు నమోదైంది. ముస్లింలైన ఇద్దరు విద్యార్థులు హయత్‌నగర్‌లోని జీ స్కూల్(zee school management)లో పదో తరగతి చదువుతున్నారు. జూన్ 12న విద్యాసంవత్సరానికి సంబంధించిన తరగతులు ప్రారంభం కాగా ఈ నెల 22 నుంచి విద్యార్థులిద్దరూ తలకు కండువా కప్పుకుని పాఠశాలకు వస్తున్నారు.
ఆ క్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తరగతి గది(class room)లో స్కార్ఫ్ ధరించవద్దని కోరారు. ఇది ఒకటి రెండు సందర్భాలలో జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ అదికారులు(police) వెల్లడించారు. ప్రిన్సిపాల్ పూర్ణిమ శ్రీవాస్తవ్, టీచర్లు మాధురి కవితలపై పోలీసులు 153ఏ, 295, 292, ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసు(case) నమోదు చేశారు.