»Wanted Cheap Russian Crude Oil Just Like India But Imran Khan
Imran Khan : ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు..!
Imran Khan : ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత కొంత కాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రశంసలు కురిపించడం విశేషం.
ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత కొంత కాలంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రశంసలు కురిపించడం విశేషం. మోదీ అనుసరిస్తున్నట్లు తమ దేశంలో కూడా విదేశాంగ విధానం అనుసరిస్తే అనేక సమస్యలు పరిష్కారం అయ్యేవని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడటం గమనార్హం.
ప్రస్తుతం తమ ప్రభుత్వం పాకిస్థాన్ లో ఉండి ఉంటే భారత్ మాదిరిగానే రష్యా నుంచి తక్కువ ధరలకే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉండేదని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. అవిశ్వాస తీర్మానంలో తమ ప్రభుత్వం పడిపోయిన కారణంగా ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండా పోయిందని ఇమ్రాన్ ఖాన్ తన బాధను వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ దేశం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆహార పదార్ధాల కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయల ధరలు, చికెన్ ధరలు, ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ధరలను అదుపు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పాకిస్థాన్ లో ప్రస్తుతం పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రంజాన్ మాసం కావడంతో పండ్లకు గిరాకీ ఎక్కువ కావడంతో రేట్లు విపరీతంగా పెరిగాయి.
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ అనేక సందర్భాల్లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో పాటు అనేక ఇతర అంశాలపై కూడా ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాను మోదీ పట్ల చేస్తున్న వ్యాఖ్యల వల్ల పాక్ దేశానికి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇమ్రాన్ భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీని పరోక్షంగా సాయం కోరుతున్నారా అనే విధంగా ఇమ్రాన్ మాటలు ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.