లైగర్ హిట్ అయి ఉంటే కథ వేరేలా ఉండేది. కానీ ఊహించని విధంగా పూరితో పాటు రౌడీ హీరోకు పెద్ద షాకే ఇచ్చింది లైగర్. దీని దెబ్బకు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. అందుకే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కథల విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి మాటల మాంత్రికుడితో ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram).. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మాంత్రికుడి ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీ లేదు.
కానీ బన్నీతో ఉంటుందని తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండతో కూడా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. గతంలో త్రివిక్రమ్.. రౌడీకీ ఓ లైన్ చెప్పినట్టు టాక్. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి గురించి ఎలాంటి ప్రస్థావన రాలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ.. త్రివిక్రమ్ కథ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా కాకుండా.. కథ మాత్రమే అందిస్తాడట త్రివిక్రమ్.
ఈ విషయంలోనే కాస్త డైలమాలో ఉన్నాడట రౌడీ. కానీ ఈ ప్రాజెక్ట్ను మేజర్ మూవీ డైరెక్టర్ శశికిరణ్ తిక్కా టేకాఫ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. శశికిరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి.. ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఇప్పుడే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి దీని తర్వాత విజయ్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.