మనిషి తోడేలుగా మారితే ఎలా ఉంటుంది.. అసలు మనిషిని తోడేలు కరుస్తుందా.. ఒకవేళ కరిస్తే ఏమవుతుంది.. ఇదే కాన్సెప్ట్‌తో బాలీవుడ్లో భేడియా అనే సినిమా రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.. తెలుగులో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ చేయగా ఇంట్రెస్టింగ్గా మారింది. వరుణ్ ధావన్(varun dhawan), కృతిసనన్ హీరో, హీరోయిన్లుగా ‘భేడియా’ అనే సినిమా తెరకెక్కింది. అమర్ కౌళిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25న రిలీజ్ కానుంది.
హిందీతో పాటు తెలుగులో ‘తోడేలు’ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో.. హీరో వరుణ్ ధావన్‌కు తోడేలు కరవడంతో నిజంగానే తోడేలు మారిపోతుంటాడు. ఇక తోడేలుగా మారిన తర్వాత వరుణ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. అనే కథాంశంతో ఈ సినిమాను తెరెక్కించినట్లు తెలుస్తోంది. అది కూడా చాలా ఎంటర్టైనింగ్ చూపించారు.
దాంతో ఈ ట్రైలర్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మధ్య బాలీవుడ్ హీరోలు టాలీవుడ్‌లోనూ తమ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. హిందీతో పాటు తెలుగులోనూ భేడియాను రిలీజ్ చేయబోతున్నారని చెప్పొచ్చు. ఈ సినిమాను మడాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్.. సమంతతో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. మరి తోడేలుగా వరుణ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.