టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రవియోగం కలిగింది. ఆయన కుమారుడు చంద్రమౌళి రెడ్డి నేడు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. ఆదివారం చంద్రమౌళికి చెన్నైలో గుండెపోటు రాగా హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. మూడు రోజులుగా చికిత్సపొందుతున్న ఆయన.. ఇవాళ కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళికి టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. జనవరిలో తిరుమలలో వివాహానికి ముహూర్తం నిర్ణయించగా.. చంద్రమౌళి తన పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారు. ఆదివారం చెన్నై ఆళ్వారుపేటలో బంధువులకు ఆహ్వానపత్రిక అందజేశారు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు.