Tomatoes fallen drastically in market high traveling expenses feed the cattle
Tomato: మొన్నటివరకు టమాటా(Tomato) కొనాలంటే చుక్కలు కనిపించాయి. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆకాశం నుంచి నేరుగా కిందపడితే ఏం అవుతుందో వీటి పరిస్థితి అలానే ఉంది. రూ. 200 పలికిన వీటి రేటు నేడు రూ.4 లోపే మార్కెట్లో ఉంది. గత మూడు నెలలుగా టమాటా ధర సామాన్యుడికి అందకుండా ఉండింది. ఇప్పుడు పశువులకు గ్రాసంగా మారింది. మొన్నటి వరకు వీటి గురించి రకరకాల వార్తలను చూశాం. ఈ కూరగాయలను పండించిన రైతు లక్షాధికారి అయ్యడని, కోటిశ్వరుడిగా మారాడని, రైతు బజార్లో దొంగలు పడి నాలుగు బస్తాలను దొంగలించారని, పంట వద్ద రైతు పోలీసులను కాపలా పెట్టాడని ఇలా అనేక కథనాలను చదివాం, చూశాము. కాని ఇప్పుడు రోజులు మారాయి. చాలా చోట్ల విటిని ఇరువైదు రూపాలకే అమ్ముతుండగా.. డైరెక్ట్ మార్కేట్లో వీటి ధర నాలుగు రూపాయల లోపే పలుకుతుంది.
దీంతో సరుకు అమ్ముడుపోక, మళ్ళీ ఇళ్లకు తీసుకుపోలేక రైతులు రోడ్లవద్ద పడేస్తున్నారు. కొందరు అయితే ఆవులు, మేకలకు మేతగా పడేస్తున్నారు. ఖరీఫ్ పంట చేతికి రావడం.. అన్ని చోట్లా వర్షాలు కురుస్తుండడంతో ఉత్పత్తి పెరగడంతో వీటి రేటె అమాంతం పడిపోయింది. ఇక కొందరైతే వాటిని మార్కెట్కు తీసుకుపోవడానకి ట్రావెలింగ్ ఖర్చులను భరించడం కష్టంగా ఉందని భావిస్తున్నారు. రోడ్లపై కుప్పలుగా పోస్తున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
రెండు నెలల క్రితం కిలో రూ.200.. నేడు కిలో రూ.1
రెండు నెలల క్రితం భారీగా పలికిన టమాటా ధరలు, నేడు రవాణా ఖర్చులకి కూడా రావడం లేదంటూ డోన్ జాతీయ రహదారిపై పారబోశారు. పశువుల కాపరులు పశువులకు మేతగా వాడుకుంటున్నారు. pic.twitter.com/IMODZpBdaa